Monday, April 29, 2024

మూడు రోజుల ‘రంగ్ దే’ కలెక్షన్స్

నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.12 కోట్ల షేర్ వసూలు చేసింది. నితిన్ గత సినిమాలతో పోలిస్తే ఇవి మంచి వసూళ్లే. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త మంచి టాక్ వచ్చిన సినిమా ఇదే కావడంతో కలెక్షన్స్ కూడా స్టడీగానే ఉన్నాయి. కాగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.24 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

‘రంగ్ దే’ తొలి మూడు రోజుల షేర్ వివరాలు:
నైజాం: 3.85 కోట్లు
వైజాగ్: 1.30 కోట్లు
సీడెడ్: 1.50 కోట్లు
ఈస్ట్: 85 లక్షలు
వెస్ట్: 58 లక్షలు
గుంటూరు: 1.09 కోట్లు
కృష్ణా: 53 లక్షలు
నెల్లూరు: 45 లక్షలు
రెస్టాఫ్ ఇండియా: రూ.65 లక్షలు
ఓవర్సీస్: రూ.90 లక్షలు
మొత్తం: రూ.19.6 కోట్ల గ్రాస్, రూ.12.25 కోట్ల షేర్

Advertisement

తాజా వార్తలు

Advertisement