Thursday, April 25, 2024

విమలకు స్ఫూర్తి రత్న పురస్కారం

తొర్రూరు, సామాజిక సేవా కార్యక్రమాలకు గాను పట్టణవాసి ధరావత్ విమల స్ఫూర్తి రత్న పురస్కారాన్ని అందుకున్నారు.సుధా సేవా సమితి ఆధ్వర్యంలో తాజాగా వరంగల్ లో నిర్వహించిన ఉగాది పురస్కారాల ప్రధాన కార్యక్రమం చేపట్టారు. కరోనా విస్తృతి వేళ పేదలకు సపర్యలు, నిత్యావసరాలు అందించి ఆదుకున్నoదుకు గాను విమలను సుధా సేవాసమితి సంస్థ గుర్తించి గౌరవించింది. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ పురస్కార గ్రహీత చింతపట్ల వెంకటాచారి చేతుల మీదుగా స్ఫూర్తి రత్న 2021 ఈ పురస్కారాన్ని ఆమెకు ప్రదానం చేశారు.ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ పేరిట సామాజిక సేవా సంస్థను నెలకొల్పి మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ స్ఫూర్తిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆమె కృషిని గుర్తించిన పలు అంతర్జాతీయ, జాతీయ సంస్థలు పురస్కారాలు ప్రధానం చేసి గౌరవించాయి. సుధా సేవా సమితి అందించిన స్ఫూర్తి రత్న పురస్కారం తనకెంతో ఉత్తేజాన్నిచ్చిందని, సేవా కార్యక్రమాల పరంపర మరింత వేగంగా కొనసాగడానికి సంస్థల పురస్కారాలు దోహద పడతాయని విమల పేర్కొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ సభ్యులు టి వి అశోక్ కుమార్, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు విజయచందర్ రెడ్డి , సుధా మాధురి , గాయకులు ప్రణయ్ కుమార్, ధర్మశ్రీ ట్రస్ట్ అధ్యక్షుడు ధారవత్ విశ్వనాధ్, లోకేష్ తదితరులు ఆమెను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement