Friday, May 17, 2024

Extra Ordinary Man Teaser | జూనియర్ ఆర్టిస్ట్‌గా నితిన్.. ఆకట్టుకుంటున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” టీజర్!

టాలీవుడ్ ప్రముఖ రైటర్ వక్కంతం వంశీతో కలిసి నితిన్ చేస్తున్న సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన మూవీ యూనిట్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. తాజాగా ఈ మూవీ నుంచి మొదటి టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.

YouTube video

ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్, ఫన్, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఈ సినిమా ఉండనున్నట్లు టీజర్ ను చూస్తే తెలుస్తోంది. రాజశేఖర్, సుదేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్ష వర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవి వర్మ, హైపర్ ఆది, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement