Sunday, February 25, 2024

Sajjala Counter – సింపతి కోసం చంద్ర బాబు టీమ్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజల నమ్మరు…

అమరావతి – టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో అవినీతికి పాల్పడ్డారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ స్టేక్ హోల్డర్స్ అందరూ కలసి నిన్న హైదరాబాద్ లో ఈవెంట్ చేశారన్నారు.స్కిల్ స్కామ్ గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు.. ఈ డ్రామాను దేశమంతా చూపిస్తున్నారన్నారు. ఏదో మ్యూజికల్ ఈవెంట్ కు రిహార్సల్స్ చేసినట్లు ప్రదర్శన చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జైల్లో చంద్రబాబు ఉండటమే తప్పంటూ వీరు అనడం ఏంటని ఆయన అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబు మాత్రమేనని అన్నారు. వ్యవస్థల్లో వైరస్ లా దూరేది ఆయనేనని అందరికీ తెలుసునని అన్నారు.

ఎన్నికలు మరో 150 రోజుల్లో రానున్నాయని, ఎవరు ఏం చేశారో చెప్పుకోగలగాలని అన్నారు. టీడీపీ ఎవరి పార్టీ అన్నది గచ్చిబౌలి ఈవెంట్ తో తేలిపోయిందన్నారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న జ్ఞానం కూడా లేదన్నారు. గతంలో ఇది మేం చేశామని చెప్పుకుని ఎన్నికలకు వెళ్లాలని సజ్జల సవాల్ విసిరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇంకా ఇలాంటి డ్రామాలు టీడీపీ నుంచి వస్తాయని, కానీ ప్రజలు మాత్రం వాటిని అర్థం చేసుకుంటారని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీల బకాయీలను కూడా తామ అధికారంలోకి వచ్చాక తామే తీర్చామని సజ్జల గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement