Tuesday, October 8, 2024

Chandrayaan 3| విక్రమ్ ల్యాండర్ కార‌ణంగా చంద్రుని ఉపరితలంపై గుంత‌.. ఎలాగో తెలుసుకోండి

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ 2023. ఈ ప్రాజెక్ట్ తో ఆగస్టు 23న చంద్రుని ఉప‌రిత‌లంపై మొదటిసారిగా అంతరిక్ష నౌకను (విక్రమ్ ల్యాండర్‌ను) విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ అంతరిక్ష నౌక చంద్రునిపైకి ప్రజ్ఞాన్ రోవర్‌ను తీసుకువెళ్లింది. ఈ రోవర్‌ జాబిల్లిపై వివిధ సైంటిఫిక్ ఎక్స్‌పరిమెంట్స్‌ చేసింది. కాగా, విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టే సమయంలో ల్యాండర్ చుట్టూ ‘ఎజెక్టా హాలో’ ఏర్పడింది.

అంటే ల్యాండర్ దిగిన ప్రదేశంలో గోతి ఏర్పడి, అక్కడి మట్టి పక్కకు జరిగింది. ఇది శాస్త్రవేత్తల్లో చాలా ఆసక్తిని రేపింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంనపై ల్యాండ్ అయినప్పుడు.. ల్యాండింగ్ సైట్ చుట్టూ దుమ్ము, ధూళి బలంగా ఎగిరిపోయి హాలో-షేప్డ్ పాటర్న్ ఏర్పడింది. దీనిని ‘ఎజెక్టా హాలో’ అంటారు. జాబిల్లిపై ఉన్న ఈ మెటీరియల్‌ను ఎపి రెగోలిత్ (Epi regolith) అంటారు. ఇది చంద్రుని క్రస్ట్ పై పొర. ఇందులో రాళ్ళు, ధూళి ఉంటాయి.

- Advertisement -

శాస్త్రవేత్తల పరిశోధన…

‘ఎజెక్టా హాలో’ ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) శాస్త్రవేత్తలు గమనించారు. ఈ మేరకు వారు చంద్రయాన్-2 ఆర్బిటర్ OHRC (ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా) తీసిన హై-రిజల్యూషన్ ఫొటోలు విష్లేశించారు. చంద్రుడి ఉపరితలంలో మార్పులను అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు ల్యాండింగ్‌కు ముందు, తరువాత ఇమేజ్‌లు పోల్చారు. ఈ పరిశోధనలో.. ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న 108.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 2.06 టన్నుల ఎపి రెగోలిత్‌ని తొలగించి విక్ర‌మ్ ల్యాండ‌ర్ స్థానభ్రంశం చేసినట్లు, దీంతోనే ఎజెక్టా హాలో ఎర్పడిన‌ట్లు తెలిసింది.

‘ఎజెక్టా హాలో’ స్టడీ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చంద్ర ఉపరితలం, లక్షణాల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తుంది. చంద్రునిపై ల్యాండింగ్ దాని పర్యావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి కూడా శాస్త్రవేత్తలు దీన్ని ఉపయోగించవచ్చు. చంద్రయాన్-3 మిషన్‌తో భారతదేశం అంతరిక్ష పరిశోధన, శాస్త్రీయ పురోగతి సాధించగలిగింది. సెప్టెంబర్ 2న హైబర్నేషన్ మోడ్‌లోకి వెళ్లడానికి ముందు విక్రమ్ ల్యాండర్ ‘హాప్ ఎక్స్‌పరిమెంట్’ పూర్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement