Saturday, October 5, 2024

Star Campaigner – బండి సంజయ్ కు హెలికాప్టర్

తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ వేగవంతం చేసింది. సీట్ల కేటాయింపు పూర్తి కాకముందే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కు హెలికాప్టర్ కేటాయించింది ఎన్నికల్లో సుడిగాలి పర్యటన కోసం హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీకి ఆదేశాలు ఇచ్చారు.

.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఆయనకు ప్రత్యేక హెలికాప్టర్ ను బీజేపీ అధిష్టానం కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే బీ సీ ముఖ్యమంత్రి అని కూడా ప్రకడించడం, వెంటనే హెలికాప్టర్ అందించడం పార్టీలో చర్చకు దారితీసింది… బండి ప్రచారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది.

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బండి సంజయ్ పోటీ చేస్తుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హోదాలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని సూచించినట్లు తెలిసింది. ప్రతి రోజు రెండు సభల్లో ఆయన పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం

- Advertisement -

. .

Advertisement

తాజా వార్తలు

Advertisement