Thursday, May 2, 2024

NIKHIL : స్వ‌యంభు చిత్రం కోసం క‌త్తి ప‌ట్టిన నిఖిల్

స్వయంభు సినిమా హిస్టోరికల్ నేపథ్యంలో నడిచే కథగా తెరకెక్కుతున్న‌ ఈ చిత్రంలో నిఖిల్ ఒక వారియర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ కారణంగా సినిమా కోసం నిఖిల్ ప్రత్యేకంగా ప్రాచీన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. ముఖ్యంగా కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. మూడు నెలల పాటు ప్రత్యేకంగా యుద్ధ విద్యలపై నిఖిల్ శిక్షణ తీసుకోవడం విశేషం. తాజాగా సోషల్ మీడియాలో నిఖిల్ కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో ఒకటి ట్విట్టర్ లో షేర్ చేశారు.

లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ తో మార్షల్ ఆర్ట్స్, కత్తి ఫైటింగ్ ని నిఖిల్ చాలా శ్రద్ధతో ఈ వీడియోలో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ప్రాక్టీస్, మోర్ ప్రాక్టీస్ అంటూ ఈ వీడియోని నిఖిల్ షేర్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని ఫిక్సల్స్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. వచ్చే గతంలో సముద్రం ఒడ్డున రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకొని నిఖిల్ ప్రాక్టీస్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కూడా వైరల్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement