Friday, May 3, 2024

‘ఆచార్య’ లో పూజా ఎంట్రీ ఉండేది అప్పుడే !!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. అదేవిధంగా మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే ఎంట్రీ ఇంటర్వెల్ సీన్స్ లోనే ఉంటుందని… ఇంటర్వెల్ కి ముందు చరణ్ చెప్పే ఫ్లాష్ బ్యాక్ లో పూజాహెగ్డే కనిపించబోతుందట.

ఇదిలా ఉండగా దేవాలయాలు మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం కోసం చిరంజీవి బరువు తగ్గడంతో పాటు…మేక్ ఓవర్ కూడా పూర్తిగా మార్చారు. అలాగే రెజీనా కసండ్ర ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement