Thursday, May 2, 2024

శ్రీకాళహస్తిలో లాక్ డౌన్.. ఆంక్షలు కఠినం!

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చ్ఛందంగా గ్రామాల్లో కూడా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. శ్రీకాళహస్తిలో కరోనా తీవ్రత నేపథ్యంలో మంగళవారం నుంచి లాక్‌ డౌన్ విధిస్తున్నట్లు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో లాక్‌ డౌన్ కాకుండా కొంత సడలింపులిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలకు అనుమతి ఇచ్చారు. ఈ తర్వాత లాక్‌ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.

మరోవైపు ఇప్పటికే మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు తిరుపతిలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఆటో వర్కర్స్, వ్యాపారులతో ఇప్పటికే చర్చించామని.. కూరగాయల మార్కెట్‌లను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నామన్నారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.  తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ బోర్డు సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఏ ఆలయంలోనూ తీర్థప్రసాదాలు ఇవ్వకూడదని కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

తిరుపతిలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వైరస్ నివారణకు తిరుపతి కార్పొరేషన్ చర్యలు ప్రారంభించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత షాపులన్నీ మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు తిరుపతిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో కరోనా కేసులు ఉన్నాయని.. వైరస్ కట్టడికి ప్రజలే స్వచ్చంధంగా బాధ్యత తీసుకోవాలని కమిషన్ గిరీషా అన్నారు. ప్రజలు సహకరించాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ బయటకు వస్తే మాస్క్, భౌతిక దూరం పాటించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement