Monday, April 29, 2024

Movie | ద‌స‌రా సందడికి కొత్త సినిమాలు రెడీ​.. థియేటర్లలో బుకింగ్స్​ ఓపెన్​

ఈ వారం థియేట‌ర్ల‌లో బాలకృష్ణ “భగవంత్ కేసరి”, రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” తో పాటు విజయ్ “లియో” సినిమాలు వ‌రల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ గా ఉన్నాయి. ద‌స‌రా కానుక‌గా వ‌స్తున్న ఈ సినిమాల‌పై అభిమానులు, ప్రేక్షుల్లో మంచి అంచ‌నాలే ఉన్నియి. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ మూడు హై బ‌జ్ ఉన్న మూవీస్ నుంచి వ‌చ్చిన సాంగ్స్, టీజ‌ర్ & ట్రైల‌ర్ లుప్రేక్ష‌కుల‌ని విశేశంగా ఆకట్టుకున్నాయి.

కాగా, ఈ వీకెండ్ కి థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీగా ఉన్నాయి. వీలైనంత త్వరగా తమ టిక్కెట్‌లను పొందే అవకాశం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండ‌గా.. కొద్ది సేప‌టి క్రితం ఈ సినిమాల బుకింగ్‌లు ఏపీ, తెలంగగాణ రాష్ట్రాల‌తో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. ఇక‌ బాలకృష్ణ “భగవంత్ కేసరి” తెలుగు వెర్షన్‌లో ప్రత్యేకంగా రిలీజ్ అవుతుండగా, “లియో” , “టైగర్ నాగేశ్వరరావు” పాన్-ఇండియన్ విడుదలకు సిద్ధమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement