Sunday, April 28, 2024

Netflix OTT Global Top 10: నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్‌ టాప్‌ 10లో 5 ఇండియన్‌ సినిమాలు.. ఏంటియో తెలుసా!

ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్‌ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఆ ఓటీటీ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌ మోనికా షెర్గిల్ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఈసారి నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌ 10 గ్లోబల్‌ మూవీస్‌లో ఐదు ఇండియన్‌ మూవీసే కావడం విశేషం. అందులో మన టాలీవుడ్‌ సినిమా ట్రిపుల్‌ ఆర్‌కు కూడా చోటు దక్కింది. అంతేకాకుండా గతేడాదితో పోలిస్తే ఈసారి నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియన్‌ సినిమాలను చూడటం కూడా 50 శాతం పెరిగింది. ఈ గ్లోబల్‌ టాప్‌ 10లో ఇండియన్‌ మూవీస్‌ ఆర్‌ఆర్‌ఆర్‌తోపాటు గంగూబాయి కఠియావాడి, భూల్‌ భులయ్యా 2 ఉన్నాయి. చాన్నాళ్లుగా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ కంటెంటే ఎక్కువగా ఉండేది. అయితే గత ఏడాదిన్నర కాలంగా తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాలీలాంటి భాషల కంటెంట్‌ కూడా పెరిగినట్లు మోనికా షెర్గిల్ చెప్పారు.

ఇక ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌ ఆలియా భట్‌తో డార్లింగ్స్‌ అనే మూవీని నిర్మించింది. గ్లోబల్‌గా ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన అతిపెద్ద మూవీ ఇదే. ఈ సినిమాకు కూడా గ్లోబల్‌ టాప్‌ 10లో చోటు దక్కింది. ఇక రాజమౌళి, సంజయ్‌లీలా భన్సాలీలపై మోనికా ప్రశంసలు కురిపించారు. ఆ ఇద్దరిపై తాము ఎంతగానో విశ్వాసం ఉంచామని చెప్పారు. ఓ సెక్స్‌ వర్కర్‌ జీవితాన్ని గంగూబాయి కఠియావాడితో అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు భన్సాలీ. ఇక చరిత్రలో రెండు వేర్వేరు కాలాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులను కలిపి.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నట్లు చూపించిన రాజమౌళి విజన్‌ కూడా అద్భతమని ఆమె కొనియాడారు. ఇక మలయాళం మూవీ మిన్నల్‌ మురళీ మూవీ కూడా నెట్‌ఫ్లిక్స్‌ గ్లోబల్‌ టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన నవరస, పిట్ట కథలులాంటి ఆంథాలజీలు కూడా ఫ్యాన్స్‌ను బాగానే అలరించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement