Saturday, April 27, 2024

Naveen polishetty | జాతి ర‌త్నానికి ఆమెరికాలో యాక్సిడెండ్….

యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తాజాగా ప్రమాదానికి గుర‌య్యాడు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న నవీన్‌కి ప్రమాదం జరగడంతో తీవ్రగాయాలయినట్లు సమాచారం. అమెరికాలో బైక్ పై ప్ర‌యాణిస్తున్న న‌వీన్ దాని మీద నుంచి జారి పడిపోయాడు. దీంతో అతడి చేతికి తీవ్ర గాయలవ్వ‌డంతో.. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన నవీన్‌కి దాదాపు రెండు నెలల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు.

ఇక నవీన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం నవీన్‌ పొలిశెట్టి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి కథ కూడా రెడీగా ఉంది. కానీ దర్శకుడి కోసం వేట కొనసాగిస్తున్నారు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత అతడు నటించబోయే తదుపరి సినిమాలపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో అతడికి ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన విషయమని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement