Sunday, May 5, 2024

న‌వీన్, అనుష్క రోమ్ కోమ్ డ్రామా.. ఆకట్టుకుంటున్న “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” ట్రైలర్!

డైరెక్టర్ మహేష్ బాబు పి దర్శకత్వం లో.. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’’. ఈ మూవీ సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీగా ఉంది. కాగా, ఈ మూవీ ఎనౌన్స్ చేసిన‌ప్ప‌టినుండే మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఇక‌ ఇప్పటికే రిలీజైన పోస్ట‌ర్స్ & పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

కాగా, ఇవ్వాల ఈమూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో ల‌వ్ & ఫన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోష‌నల్ ట‌చ్ కూడా కనిపిస్తోంది. మరోసారి నవీన్ పూర్తి స్థాయిలో ఆడియెన్స్ ను అలరించనున్నట్లు ట్రైలర్ ను చూస్తే తెలుస్తోంది.

YouTube video

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement