Tuesday, May 14, 2024

Rashmika : నేష‌న‌ల్ క్ర‌ష్ స‌రికొత్త అందం

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ ఆ తర్వాత కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది. నేషనల్ క్రష్‌గా అందరికీ సుపరిచితమైన ఈ భామ.. ’పుష్ప’తో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఈ భామ బాలీవుడ్ బడా సీనియర్ హీరో సరసన యాక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసింది.

అర్జున్ రెడ్డి హ్యాంగోవర్‌తో అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించి హిట్ అందుకున్న సందీప్ రెడ్డి.. యానిమల్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు బాలీవుడ్‌లో పాగా వేయాలనుకుంటున్న రష్మికకు కూడా ఈ సినిమా విజయం కీలకమనే చెప్పాలి. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రతో అక్కడ ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే కదా. ఇక పుష్ప 2లో ఈమెది పవర్‌ఫుల్ పాత్ర. ఈ సినిమా వచ్చే యేడాది ఆగష్టు 15న విడుదల కానుంది. టాప్ హీరోయిన్ హోదా అనుభ‌విస్తున్న ఈ భామ క‌న్ను బాలీవుడ్ పై ఉండటంతో ఎక్కువ‌గా గ్లామ‌ర్ షో షూట్ లు, ఈవెంట్స్ లో ఎక్కువుగా చేస్తున్న‌ది.. ఈ ఈవెంట్స్ లో నేష‌న‌ల్ క్ర‌ష్ ధ‌రించే వేర్ చూస్తే గుండాగిల్సిందే.. ఒంటిసై ఒలువ‌లు లేనంత‌గా చేసిన ఈ షూట్లు నెటిజ‌న్స్ మండిప‌డ‌టంతో కాస్త రూట్ మార్చింది.. ట్రేడిష‌న‌ల్ శారీ క‌ట్టిన పిక్ వ‌దిలింది.. ఇందులోనూ కావాల్సినంత గ్లామ‌ర్ ను పోసేసి చూసుకోమంటున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement