Sunday, October 6, 2024

MBNR: బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి..? డీకే అరుణ

గద్వాల (ప్రతినిధి) నవంబర్ 21 (ప్రభ న్యూస్) : పదేండ్లలో ఏమీ అభివృద్ధి చేశారు..? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె.అరుణ ప్రశ్నించారు. ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ధరూర్ మండలం అల్వలపాడు, కోతుల గిద్ద, కొత్త పాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలిగార శివారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, నిరుద్యోగ భృతి రాలేదని, ఇంట్లో ఇద్దరు అర్హులున్నా పింఛన్ ఇవ్వలేదన్నారు. పదేళ్లయినా స్కూళ్లలో ఒక్క టీచర్ ని భర్తీ చేయలేదని, తెలంగాణలో చదువుని నిర్వీర్యం చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నిధులతోనే వైకుంఠధామాలు. రైతు వేదికలు, హరితహారం, సీసీ రోడ్లు, వీధిలైట్లు వంటి వాటితో గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. మండలానికి అనేక సబ్ స్టేషన్లు ఇచ్చి ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుచేసి కరెంటు లో వోల్టేజ్ సమస్య లేకుండా నెట్టెంపాడు సాధించడంతో కరెంట్, నీళ్లు పుష్కలంగా ఉండడంతో పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే వరి రైతులకు రూ.3,100ల మద్దతు ధర, సంవత్సరానికి 4 సిలిండర్లు ఇస్తారని, అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఆలోచించిందన్నారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement