Friday, May 3, 2024

జగన్ దగ్గర పని చేయాలనే ఉత్సాహం ఉంటే ఖాకీ వదిలేయ్…నారా లోకేష్

వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఇద్దరు టిడిపి కార్యకర్తలను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే విషయమై ఎస్పీ అమ్మి రెడ్డి పై ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సోషల్ మీడియా లో వీడియోలు పెట్టిన వాళ్లను అంతర్జాతీయ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఓవరాక్షన్ ఏంటి అంటూ మండిపడ్డారు నారా లోకేష్. ఇలాంటి వీడియోలు టిడిపి వాళ్లపై కూడా పెట్టారని తాము గతంలో ఫిర్యాదు చేస్తే ఎన్ని కేసుల లో మీరు అరెస్టు చేశారో చెప్పాలని లోకేష్ అన్నారు.

మంత్రి సీదిరి అప్పలరాజు పై కేసు పెట్టడానికి వచ్చిన వారిపై తిరిగి కేసులు పెట్టారని అన్నారు. ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ తాడేపల్లి కొంపకు చాకిరీ చేయడానికి సిగ్గు లేదా జగన్ వద్ద పని చేయాలని అంత ఉత్సాహం కులపిచ్చి ఉంటే పవిత్ర ఖాకీ డ్రెస్ తీసేసి బుడుగు కండువా కప్పుకోండి అంటూ నారా లోకేష్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement