Wednesday, May 1, 2024

నాని 30వ సినిమా గ్లింప్స్ వీడియో రిలీజ్‌.. మృణాల్‌తో రోమాన్స్ చేయ‌నున్న నేచుర‌ల్ స్టార్‌

2008లో వచ్చిన ‘అష్టా చెమ్మా’తో నాని నట జీవితం ప్రారంభమైంది. తన నటనతో ప్రేక్షకులని ఆకట్టుకుంటూ.. నాచురల్ స్టార్ అనే గుర్తింపు తెచ్చుకున్న నాని 14 ఏళ్లలో 29 సినిమాల్లో నటించాడు. కాగా, ఇప్పుడు అతని 30వ చిత్రం అనౌన్స్ అయ్యింది. నాని ప్రస్తుతం దసరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. శ్రీకాంత్‌ ఓదెల డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

కాగా.. ఇవ్వాల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని నాని 30వ సినిమాని ప్రకటించాడు. ఈ సందర్బంగా గ్లింప్స్‌ వీడియో షేర్ చేశాడు నాని. తండ్రీకూతుళ్ల రిలేషన్‌ షిప్‌ నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో అర్థమవుతోంది. నాని కొత్త సినిమాలో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మోహన్‌ చెరుకూరి, డాక్టర్ విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement