Saturday, May 4, 2024

సైలెంట్ గా స్టార్ట్ చేసిన నాని

న్యాచురల్ స్టార్ నాని ఓవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ బ్యానర్ పై ఇప్పటికే అ!!, హిట్ వంటి హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాకు రెడీ అయ్యాడు నాని. ఎటువంటి హడావిడి లేకుండా ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈ చిత్రానికి మీట్ క్యూట్ అనే అందమైన టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని దీప్తి గంట డైరెక్ట్ చేస్తున్నారు.

దీప్తి నానికి స్వయానా సోదరి. ఆమెను దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేస్తున్నారు నాని.దీప్తి గతంలో అనగనగా ఒక నాన్న అనే షార్ట్ ఫిలిం చేశారు. ఇక ఈ సినిమాకు కధ కూడా ఆమె రాసుకున్నారు. నాని క్లాప్ కొట్టి చిత్రీకరణను స్టార్ట్ చేశారు. షాట్ లో సీనియర్ నటుడు సత్యరాజ్ టైటిల్ రోల్ చేస్తున్నట్టు లేడీ కూడా ఉన్నారు. కాగా ఆమె ఎవరు అనేది మాత్రం రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement