Monday, May 6, 2024

‘రా’ ఆఫీసర్ గా నందమూరి కళ్యాణ్ రామ్ ?

కెరీర్ ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా అతనొక్కడే, పటాస్ ,118 అలా 1,2 హిట్లను అందుకున్న కళ్యాణ్ రామ్ సరైన బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నూతన దర్శకుడు రాజేంద్ర దర్శకత్వం మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి అయింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రా ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.

మరోవైపు బాలయ్య బోయపాటి సినిమా అఖండ లో కూడా కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇంటర్వెల్ ముందు కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement