Friday, April 26, 2024

అభిమానులకు బాలయ్య విన్నపం

మామూలుగా అభిమాన హీరోల పుట్టినరోజులు వచ్చాయంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. కేక్ లు కట్ చేయడం , పాలాభిషేకాలు, రక్త దానాలు ఇలా చాలానే చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హీరోలందరూ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయవద్దని ఫ్యాన్స్ కు విన్నపం చేస్తూ వస్తున్నారు.

కాగా జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే తన పుట్టిన రోజు సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేయవద్దని అభిమానులకు ఓ సందేశాన్ని పంపారు బాలయ్య.

ప్రాణ సమానులైన అభిమానులకు ..ప్రతిఏటా జూన్ 10 వతేదీ నాపుట్టినరోజునాడు ..నన్ను కలిసేందుకు నలుదిక్కులనుండీ తరలివస్తున్న మీ అభిమానానికి సర్వదా విధేయుడ్ని ..కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మీరు రావటం అభిలషణీయం కాదు .. నన్నింతటివాడ్ని చేసింది మీ అభిమానం..ఒక్క అభిమాని దూరమైనా నేను భరించలేను .. మీ అభిమానాన్ని మించిన ఆశీస్సు లేదు మీ ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్ష లేదు మీ కుటుంబం తో మీరు ఆనందంగా గడపటమే నా జన్మదినవేడుక .. దయచేసి రావద్దని మరీ మరీ తెలియజేస్తూ .. ఈ విపత్కాలంలో అసువులు బాసిన నా అభిమానులకూ కార్యకర్తలకూ అభాగ్యులందరికీ నివాళులర్పిస్తూ ..మీ నందమూరి బాలకృష్ణ అంటూ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement