Thursday, April 25, 2024

నాజర్ ఫస్ట్ లుక్ @నల్లమల

అటవీ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రవి చరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నల్లమల. ఈ సినిమాలో అమిత్ తివారి, భాను శ్రీ, తనికెళ్ల భరణి ,అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అసాధారణ మేధస్సు గల ఓ సైంటిస్ట్ ప్రపంచాన్ని శాసించే శక్తి తన పరిశోధనలకు ఉండాలని తన ప్రయోగాలకు నల్లమలను క్షేత్రంగా ఎంచుకుంటాడు. అక్కడ అతను ఎలాంటి ప్రయోగాలు చేశాడు… ఏం కనుగొన్నాడు…ఆ ప్రయోగాల ఫలితంగా ఏం జరిగిందనేది ఈ నల్లమల కథ.

అయితే ఈ సినిమాలో ప్రముఖ నటుడు నాజర్ సైంటిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా నాజర్ పాత్రకు సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఆ లుక్ లో నాజర్ తుపాకి పట్టుకొని కౌబాయ్ గెటప్ లో కనిపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement