Tuesday, May 21, 2024

నాగార్జున బర్త్ డే… తనయుల స్పెషల్ విషెస్

టాలీవుడ్ `మన్మథుడు` నాగార్జున నేడు తన 62వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఆయన తనయులు తండ్రి పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ స్పెషల్ పిక్స్ పోస్ట్ చేశారు. ఇప్పటికే విడుదలైన ఆయన సీడీపీని అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు నాగ్ పెద్ద కొడుకు, టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఈరోజు ప్రత్యేకంగా ఈ రోజు మధ్యాహ్నం 12:06 గంటలకు “బంగార్రాజు” పోస్టర్ ను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. మనం, ప్రేమమ్ తర్వాత నాగ్, చై స్క్రీన్ స్పేస్ పంచుకుంటున్న మూడవ చిత్రం “బంగార్రాజు”. ఈ చిత్రం 2022 సంక్రాంతికి విడుదల కానుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. “సోగ్గాడే చిన్ని నాయన”లోని బంగార్రాజు పాత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నాగ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. కాగా ఇవాళ ఉదయమే నాగార్జున నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ వచ్చింది. `ఘోస్ట్` పేరుతో రూపొందుతున్న ఈ సినిమా లుక్ ని విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో జింకకు కరోనా

Advertisement

తాజా వార్తలు

Advertisement