Thursday, April 25, 2024

లండ‌న్ లో నాగ‌చైత‌న్య‌.. వెన‌క ఉన్న‌ది శోభితా ధూళిపాళేనా

హీరో నాగచైతన్య బిజీ షెడ్యూల్‌ మెయింటైన్‌ చేస్తూనే.. వీలు దొరికినప్పుడల్లా ఈ భామతో చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.ఈ ఇద్దరు కలిసి కనిపించిన ఫొటోలు ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లండన్‌ రెస్టారెంట్‌ ఫొటో ఒకటి ఈ ఇద్దరి డేటింగ్ రూమర్స్ కు బలం చేకూరుస్తుంది. చైతూ, శోభితా ధూళిపాళ లండన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో.. చైతూతో చెఫ్‌ ఫొటో దిగాడు.ఆ వెనకాల శోభితా ధూళిపాళ కూడా ఉన్నారు. ఆమె తన మొఖం కనిపించకుండా.. చేయి అడ్డుపెట్టుకొని ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళతో రిలేషన్ లో ఉన్నాడని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా ఈ ఇద్దరు కెమెరాల కంటికి చిక్కారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement