Tuesday, April 30, 2024

నాగచైతన్య స్పీడ్ మాములుగా లేదు….వెంకీ కుడుములతో కూడా !!

హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు అక్కినేని హీరో నాగచైతన్య. కెరీర్ స్టార్టింగ్ లో కొద్దిగా స్లోగా సినిమాలు చేసినప్పటికీ… ప్రస్తుతం మాత్రం స్పీడ్ పెంచాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేశాడు చైతన్య. ఈ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో థాంక్యు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్నాడు చైతన్య. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించబోతున్నాడు చై. అయితే ఈ సినిమాలో చైతు పాత్ర నిడివి 10 నిమిషాలట. ఒక తెలుగు కుర్రాడి పాత్రలో చైతు కనిపించబోతున్నాడని… ఇది ఒక గెస్ట్ రోల్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. మరో వైపు వెంకీ కుడుముల తో కూడా నాగచైతన్య సినిమా చేయబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement