Monday, December 9, 2024

స‌రికొత్త అనుభూతిని పంచే మ్యూజిక్ స్కూల్ – ట్రైల‌ర్

YouTube video

ముంబైలో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ -టైలర్‌ వేడుక ఘనంగా జరిగింది. దర్శకనిర్మాత పాపారావు బియ్యాల, శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -టైలర్‌ని విజయ్‌ దేవరకొండ డిజిటల్‌గా ఆవిష్కరించారు. -టైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని మెచ్చుకుంటు-న్నారు.
ఇళయరాజా సంగీతం అందించిన సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. చక్కటి సంగీతం, ఆసక్తికలిగించే డ్రామా, కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, వినోదాన్ని పంచే దృశ్యాలతో ఆకట్టు-కుంటోంది -టైలర్‌.

ఈ సినిమాలో శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి సంగీత, నృత్య టీ-చర్లుగా నటించారు. గ్రేసీ గోస్వామి, ఓజు బారువాతో పాటు- మరికొంతమందికి ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ పేరుతో ఓ మ్యూజికల్‌ ప్లేని ఏర్పాటు- చేస్తారు. సమాజం, టీ-చర్లు, తల్లిదండ్రులు పిల్లలపై పెంచుతున్న ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్‌ ఇవ్వడం కోసం మ్యూజిక్‌, డ్యాన్స్‌ టీ-చర్లు చేసిన ప్రయత్నం మెప్పిస్తోంది. మ్యూజికల్‌ జర్నీలా అనిపిస్తోంది. డ్రామా, వినోదం, భావోద్వేగాలు, సంగీతం మిళితమై అందమైన ప్యాకేజ్‌లా కనిపిస్తోంది -టైలర్‌. గోవా పరిసరాల్లోని అత్యద్భుతమైన లొకేషన్లు కన్నులవిందు కలిగిస్తున్నాయి.
అత్యద్భుతమైన ప్యాషన్‌తో ఫిల్మ్‌ మేకర్‌గా మారిన ఐఏయస్‌ ఆఫీసర్‌ పాపారావు బియ్యాల ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఓజు బావురా, గ్రేసీ గోస్వామీ ఈ సినిమాతో పరిచయమవుతున్నారు. బెంజమిన్‌ గిలానీ, సుహాసిని మూలే, మోనా అంబేగోయంకర్‌, లీలా సామ్‌సన్‌, బగ్స్‌ భార్గవ, వినయ్‌ వర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వాక్వార్‌ షేక్‌, ఫణి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. పలువురు బాల నటీ-నటు-ల్ని ఈ సినిమాతో పరిచయం చేస్తున్నారు. మ్యూజిక్‌ స్కూల్‌ని యామిని పిల్మ్స్‌ నిర్మిస్తోంది. హిందీ, తెలుగులో తెరకెక్కించారు. తమిళంలోకి అనువదించారు. మే 12న పీవీఆర్‌ ద్వారా హిందీలో విడుదల చేస్తున్నారు. తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement