Thursday, May 2, 2024

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ చూశా.. రామ్ చ‌ర‌ణ్‌

మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి టీజ‌ర్ ని తాను చూశాన‌ని ట్వీట్ చేశారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.తాజాగా ఈ టీజర్ పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పందించారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ గురించి ట్వీట్ చేస్తూ చిత్ర యూనిట్ ని సర్ప్రైజ్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టీజర్ నాకు చాలా బాగా నచ్చింది. రెప్రెషింగ్ గా అనిపిస్తోంది. చిత్ర యూనిట్ కి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు. హీరోయిన్ అనుష్క శెట్టి.. నవీన్ పోలిశెట్టి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే చిత్రంలో నటిస్తున్నారు. పి మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. యంగ్ హీరో సరసన అనుష్క శెట్టి జత కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలా ఉండబోతోంది.. అసలు ఈ చిత్రంలో అనుష్క గ్లామర్.. నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఉంది. ఇటీవల టీజర్ విడుదల చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. నవీన్, అనుష్క మధ్య కెమిస్ట్రీ చాలా కొత్తగా అనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement