Tuesday, May 21, 2024

క్యాబ్ స్టోరీస్ ట్రైలర్ రిలీజ్ చేసిన మిల్కీ బ్యూటీ

క్యాబ్ స్టోరీస్ వెబ్ సిరీస్ ఈ నెల 28న స్పార్క్ ఓటీటీ లో రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. కెవిఎన్ రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో దివి, గిరిధర్, ధనరాజ్, ప్రవీణ్, శ్రీకాంత్ ,సిరి ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రాగా… తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈ ట్రైలర్ లో దివి ఏం జరిగినా తనకు అనుకూలంగా మలుచుకునే ఒక యువతిగా కనిపిస్తోంది. మిగిలిన వారి పాత్రలు కూడా ఎవరిది పాజిటివ్ ఎవరిది నెగిటివ్ అనేది తెలియకుండా డైరెక్టర్ ఈ ట్రైలర్ ను కట్ చేయించారు. సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ వెబ్ సిరీస్ కు సాయి కార్తీక్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement