Friday, April 26, 2024

మెహ్రీన్ మళ్ళీ స్టార్ట్ చేయబోతోంది!!

కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు మెహ్రీన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలు కూడా నటించి మంచి సక్సెస్ ను అందుకున్నాయి. అలాగే ఎఫ్ 2 సినిమాలో నటించి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. వరుస సక్సెస్ లను సాధించి మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఈ అమ్మడు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నిశ్చితార్థం వరకు వెళ్ళింది.

కానీ కొన్ని కారణాల వల్ల వివాహం రద్దయింది. దీనితో ఇప్పుడు మళ్ళీ తన పూర్తి దృష్టిని సినిమాలపై పెట్టేందుకు మెహ్రీన్ రెడీ అయింది. సాధ్యమైనంత త్వరగా సినిమాలను లైన్లో పెట్టాలని నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే మూడు సినిమాలను ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఆ మూడు సినిమాలు కూడా త్వరలోనే పట్టాలెక్కిననున్నాయట. ఇక ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో మెహ్రీన్ నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement