Friday, April 26, 2024

మెగాస్టార్ 154 @వాల్తేరు శీను

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీనితో పాటు లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. అలాగే దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. వీటి తర్వాత డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి పుట్టినరోజు నాడు…. కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాకి మొదట వీరయ్య అనే టైటిల్ ను అనుకున్నారట. కానీ టైటిల్ విషయంలో చిరు అసంతృప్తి ఫీల్ అవ్వడం తో తాజాగా వాల్తేరు శీను అనే టైటిల్ ను చిరంజీవి చెప్పారట. అందుకు చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే… లుంగీ పైకి కట్టి,తలకి టవల్ చుట్టి.. బీడీ కాలుస్తూ లంగర్ పట్టుకుని చిరు కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement