Sunday, April 28, 2024

అభిమాన నటున్ని కలిసిిన గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా..

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక సాధించిన తర్వాతా నీరజ్ చోప్రా దేశవ్యాప్తంగా అందరికి సుపరిచితమయ్యాడు. అతడు ఏం చేసిన అదో పెద్ద వార్త అయిపోతుంది. అయితే తాజాగా తన అభిమాన హీరో రణ్‌దీప్‌ హుడాని పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌లో కలుసుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టు పెట్టాడు రణ్ దీప్ హుడా. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను రణ్‌దీప్‌ హుడా తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేస్తూ.. నీరజ్‌ను ఆకాశానికెత్తాడు.

కాగా ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ మాట్లాడుతూ.. ఇంగీ​ష్‌, పంజాబీ, హిందీ భాషల్లో సినిమాలు చూస్తానని, తన ఫేవరెట్‌ హీరో రణ్‌దీప్‌ అని, అతను నటించిన ‘లాల్‌రంగ్‌’ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. లాల్‌రంగ్‌ సినిమా మొత్తం హరియాణా యాసలో ఉండటంతో అది బాగా నచ్చిందని, అలాగే రణదీప్‌ నటించిన ‘సర్బజీత్‌’, ‘హైవే’ తనను చాలా ఆకట్టుకున్నాయని పేర్కొన్నాడు. నీరజ్‌2018 ఆసియా క్రీడల్లో విజయం సాధించిన అనంతరం మీ బయోపిక్‌లో ఏ హీరో నటిస్తే బాగుంటుందని మీడియా ప్రశ్నించగా.. రణ్‌దీప్‌ హుడా అయితే బాగుంటుందని చెప్పిన విషయం తెలిసిందే. నీరజ్‌, హూడా ఇద్దరూ హర్యానా రాష్ట్రానికే చెందిన వారే కావడం, అలాగే ఇద్దరికీ క్రీడలంటే అమితమైన ఆసక్తి ఉండడంతో వారి మధ్య స్నేహం బలపడింది.

ఇది కూడా చదవండి: మంత్రి మాట్లాడే తీరు అదేనా..?: హరివర్ధన్ రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement