Monday, April 29, 2024

బుచ్చిబాబుకు బెంజి కారు:గిఫ్ట్ ఇచ్చిన నిర్మాతలు

తొలి సినిమా ఉప్పెనతోనే తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ సినిమా వంద కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. తమ సంస్థకు ఇంతపెద్ద హిట్ ఇచ్చినందుకు మైత్రీమూవీ మేకర్స్ బుచ్చిబాబుకి ఓ బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చారు. దర్శకుడు బుచ్చిబాబుకు కారు లేదా ఇల్లును ఆఫర్‌ చేయగా ఆయన కారు తీసుకునేందుకు ఆసక్తి చూపారట. దీంతో తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌ బుచ్చిబాబుకు బెంజి జీఎల్‌సీ కారును బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు రూ.75 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక కారులో బుచ్చిబాబు తన గురువు సుకుమార్ ని ఎక్కించుకొని సికారుకు వెళ్లాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement