Wednesday, May 15, 2024

Sonarika: మ‌త్య్స క‌న్య‌….

జాదుగాడు చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది బ్యూటీ సోనారిక బ‌దోరియా. నాగశౌర్య స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ ఆరంభం గ్లామర్ షోకి వెన‌కాడ‌లేదు. బాలీవుడ్ లో సాన్ సీన్ అనే చిత్రంలో న‌టించింది.

ఇంద్రజిత్ అనే త‌మిళ చిత్రంలోనూ నాయిక‌గా న‌టించింది. కానీ సౌత్ లో ఈ బ్యూటీకి స‌రైన ల‌క్ చిక్కలేదు. అవ‌స‌ర‌మైన విజ‌యం ద‌క్క‌లేదు. చివ‌రికి టీవీ సీరియ‌ళ్ల‌తో బిజీ అయింది. హిందీలో హరహర మహదేవ్ సీరియల్ తో సోనారిక న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవ‌ల సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు పెంచిన సోనారిక హాటెస్ట్ ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. తాజాగా బికినీలో నదిలో స్నానానికి వెళుతున్న ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. అక్క‌డ సూర్యాస్త‌మ‌యం వేళ సోనారిక నీటిలో జ‌ల‌కాలాట‌ల‌కు వెళుతోంది. ఈ అంద‌మైన ఫోటోలు ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement