Sunday, April 28, 2024

IPL : హ‌ర్డిక్ పాండ్యా కోసం ఎదురు చూస్తున్న రికార్డ్

ఐపీఎల్ 2024లో హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు సొంతం చేసుకునే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని లాంటి అత్యుత్తమ కెప్టెన్లు సైతం ఈ రికార్డును అందుకోలేకపోయారు. కానీ టీమిండియా ఆల్‌రౌండర్, మాజీ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఛాన్స్ ఉంది.

రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని ఒకే ఫ్రాంచైజీకి బోలెడన్ని ట్రోఫీలు సాధించిపెట్టారు. కానీ హార్దిక్ ఈసారి సీజన్‌లో ముంబై ట్రోఫీ అందిస్తే.. రెండు ఫ్రాంచైజీలకు వేర్వేరు సమయాల్లో ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. హార్దిక్ పాండ్యా తన ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించాడు. 2015లో ఎంఐ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి అరంగేట్రం చేశాడు. ముంబైతో ఏడు సీజన్లు ఆడిన తర్వాత.. 2022 మినీ వేలంలో, కొత్త ఫ్రాంచైజీ జట్టు గుజరాత్ టైటాన్స్‌లోకి చేరాడు. వచ్చీరాగానే అతడ్ని గుజరాత్‌కు కెప్టెన్‌గా నియమించింది ఫ్రాంచైజీ. కట్ చేస్తే.. గుజరాత్ టైటాన్స్ తొలి ఐపీఎల్ సీజన్‌లో ఛాంపియన్. ఆ తర్వాత సీజన్‌లో రన్నరప్. ఇక ఈసారి హార్దిక్ ముంబై ఇండియన్స్‌కు తిరిగి వచ్చాడు. రోహిత్ స్థానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

- Advertisement -

కెప్టెన్లుగా రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ చెరో ఐదు ట్రోఫీలు.. గౌతమ్ గంభీర్ కెప్టెన్‌గా రెండుసార్లు ఐపీఎల్ విజేతగా కేకేఆర్‌ను నిలిపాడు. దీంతో పాటు షేన్ వార్న్, డేవిడ్ వార్నర్, అడమ్ గిల్‌క్రిస్ట్, హార్దిక్ పాండ్యా‌లు చెరొకసారి తమ కెప్టెన్సీలో ట్రోఫీలు గెలుచుకున్నారు. కానీ ముందు ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్‌(హార్దిక్)గా గెలిచి.. ఈసారి వేరే ఫ్రాంచైజీ(ముంబై)కి ట్రోఫీని గెలిస్తే.. తొలి కెప్టెన్‌గా ఈ రికార్డు అందుకునే ఘనత హార్దిక్‌ పాండ్యా సొంతమవుతుంది. మరి ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు చేరుతుందో..? లేదో.? చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement