Thursday, May 2, 2024

మాస్క్ మరిచిపోయిన రష్మిక…క్యూట్ స్మైల్ తో వీడియో వైరల్

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రష్మిక మందన్న. ఆతర్వాత గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అది ఏంటంటే మరచిపోయి మాస్క్ లేకుండా బయటకు వచ్చింది రష్మిక. అయితే అప్పటికే ఫోటోలు వీడియోలు కొంతమందిని తీస్తున్నారు. అది చూసి వెంటనే మాస్క్ మరిచిపోయా అంటూ క్యూట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. అంతేకాకుండా చేతిని అడ్డుపెట్టి ముసిముసి నవ్వులు నవ్వింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement