Friday, April 26, 2024

మహేష్ సినిమాలో మాస్టర్ హీరోయిన్ ?

సూపర్ స్టార్ మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించలేక పోయినప్పటికీ జనాలకు మాత్రం బాగానే కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి క్యాస్టింగ్ విషయంలో రకరకాల వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ విషయంలో ముఖ్యంగా రోజుకో వార్త బయటకు వస్తుంది. తాజాగా మహేష్ సినిమాలో మాస్టర్ బ్యూటీ మాళవిక మోహనన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో పూజా హెగ్డే జాన్వికపూర్ ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement