Sunday, May 5, 2024

నెట్‌ఫ్లిక్స్‌లో అల‌రించ‌నున్న ‘‘శాకిని డాకిని’’.. ఓటీటీ డేట్ అనౌన్స్ చేసిన మేక‌ర్స్..

రెజీనా, నివేథా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా ‘‘శాకిని డాకిని’’. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 16న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. కొరియ‌న్ మూవీ మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ ఆధారంగా ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ ఈ సినిమాని తెర‌కెక్కించాడు. పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న షాలిని, దామిని అనే ఇద్ద‌ర‌మ్మాయిలు ప్ర‌మాద‌క‌ర‌మైన హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాను ఎలా ఎదుర్కొన్నార‌నే క‌థాంశంతో కామెడీ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందింది. కాగా, ఈ రోజు మూఈ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేక‌ర్స్.

కాగా, థియేట‌ర్ల‌లో విడుద‌లైన ప‌దిహేను రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్న‌ది. రేపటి (సెప్టెంబ‌ర్ 30) నుంచి శాకిని డాకిని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్‌తో క‌లిసి సునీత తాటి ఈ సినిమాను నిర్మించింది. వ‌కీల్ సాబ్ త‌ర్వాత నివేథా థామ‌స్ న‌టించిన సినిమా ఇది. రెజీనా కూడా చాలా రోజుల త‌ర్వాత తెలుగులో చేసిన సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement