Thursday, May 9, 2024

ముంబై టెర్రర్ అటాక్ లో వీర మరణం పొందిన “మేజర్”.. జీవిత కథ

ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో రూపొందుతున్న సినిమా ‘మేజర్‌’. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రను అడివి శేష్‌ పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా తెలుగు హిందీలో భాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. మరో వైపు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ‘మేజర్‌’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ ”హృదయమా…. ” ఈ నెల 7న విడుదల చేస్తున్నారు.

శ్రీచరణ్‌ పాకాల ‘మేజర్‌’ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ పాటకు వీఎన్‌ వీ రమేష్‌, కృష్ణకాంత్‌ సాహిత్యాన్ని అందించగా..సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ‘హృదయమా… ‘ పాటని అడివి శేష్‌, సాయీ మంజ్రేకర్‌ పై రొమాంటిక్‌ గా పాటగా చిత్రీకరించారు. ఇటీ వలే ఈ సినిమా హిందీ వెర్షన్‌కి డబ్బింగ్‌ ప్రారంభించారు హీరో అడివి శేష్‌. జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో ‘మేజర్‌’ సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన ‘మేజర్‌’ టీ-జర్‌కి విశేషమైన స్పందన వచ్చింది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్‌, ప్రకాష్‌ రాజ్‌, రేవతి మరియు మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం. ఈ చిత్రానికి మహేష్‌ బాబు జిఎంబి ఎంటర్‌-టైన్‌మెంట్‌ నిర్మాణ భాగస్వామి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement