Sunday, April 28, 2024

మహేష్ ,త్రివిక్రమ్ ఫిక్స్ – అధికారిక ప్రకటనే తరువాయి

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ రెండు సినిమాలు థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోకపోయినా దాని ఇంపాక్ట్ మాత్రం జనాలలో బాగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు మరో సినిమా రాబోతున్నట్లు ఇటీవల వార్తలు
వచ్చాయి.

మరోవైపు మహేష్ బాబు రాజమౌళి తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా కన్నా ముందే మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు. అంతకు ముందు వరకు చాలా పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ ఆ తర్వాత త్రివిక్రమ్ నే ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. కాగా ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. మరోవైపు త్రివిక్రమ్ తో చేయవలసిన ఎన్టీఆర్ కొరటాల శివకు షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement