Friday, March 29, 2024

సింగర్ గా మారిన దుల్కర్ సల్మాన్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. మహానటి తో పాటు మరికొన్ని డబ్బింగ్ చిత్రాలతో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అయితే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ సింగర్ గా సరి కొత్త అవతారమెత్తాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ చిత్రం హే సినామిక చిత్రంలో దుల్కర్ ఓ పాట ను పాడారు. ఇక దుల్కర్ కు ఇదే మొదటి పాట కావడం విశేషం.

గతంలో చాలామంది హీరోలు సింగర్ గా అవతారమెత్తిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో అతిథి రావు హైదరి, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement