Monday, May 6, 2024

మహేష్ సినిమాలో కృతిశెట్టి ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ రెండింటికీ మధ్యలో మరో సినిమాని కూడా పట్టాలెక్కించాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. ఆ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పనులు సైలెంట్ గా జరుగుతున్నాయట.

కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అది మరేదో కాదు ఈ సినిమాలో మహేష్ సరసన కృతి శెట్టి నటించబోతుందట.ఉప్పెన సినిమాతో కృతి శెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది. నటన పరంగా కూడా విమర్శకులను సైతం మెప్పించింది. అదే కనుక నిజమైతే కృతి బంపర్ ఆఫర్ కొట్టినట్లే.

Advertisement

తాజా వార్తలు

Advertisement