Friday, May 10, 2024

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా మామ‌న్న‌మ్.. ఆస‌క్తిక‌రంగా ట్రైల‌ర్

న‌టులు ఉద‌య‌నిధి స్టాలిన్.. ఫాహ‌ద్ ఫాజిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం మామన్నమ్. పొలిటికల్ థ్రిల్లర్ గా ద‌ర్శ‌కుడు మారి సెల్వ‌రాజ్ తెర‌కెక్కిస్తున్నాడు.కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను రెడ్‌ జియాంట్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలో మేకర్స్ మామన్నమ్ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. లెటెస్ట్‌గా రిలీజైన ట్రైలర్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. పరియారుమ్‌ పెరుమాళ్, కర్ణన్ మాదిరిగానే ఈ సినిమా కూడా ఒక డార్క్‌ మోడ్‌లో సినిమా సాగుతున్నట్లు స్పష్టమయింది. ఒక పొలిటీషియన్‌కు, సాధారణ మధ్య తరగతి తండ్రికి మధ్య జరిగే రివేంజ్‌ స్టోరీలా అనిపిస్తుంది. ఆ పగను కొడుకుతో పాటు తీర్చుకోవాలనుకుంటున్నట్లు హీరోతో వాళ్ల నాన్న చెప్పే డైలాగ్స్‌ వింటే స్పష్టమయింది. యాక్షన్ కూడా పుష్కలంగా దట్టించినట్లు తెలుస్తుంది. ఫాహద్‌ ఫాజిల్‌కు, ఉదయనిధి స్టాలిన్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలవబోతున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement