Sunday, April 28, 2024

Mamita Baiju: ప్రేమ‌లు హీరోయిన్ కోసం ప‌డిగాపులు…

మలయాళంలో సూపర్ హిట్టైన ప్రేమలు సినిమా తెలుగులో కూడా యూత్ ఆడియన్స్ ను అలరిస్తుంది. సినిమాను రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగు లో రిలీజ్ చేసేసరికి ఎక్కువ రీచింగ్ వచ్చింది. తెలుగు యువత అంతా కూడా ప్రేమలు హీరోయిన్ మమితా బైజుతో ప్రేమలో పడిపోతున్నారు. ప్రేమలు మలయాళంలో బ్లాక్ బస్టర్ కాగా తెలుగులో కూడా ఆ సినిమా బాగానే సందడి చేసింది. ఈ సినిమాలో నటించిన మమితా బైజుకి అయితే ఇక్కడ సూపర్ పాపులారిటీ వచ్చింది.

- Advertisement -

సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగు ఆడియన్స్ కు ఏ హీరోయిన్ అయినా నచ్చేస్తే ఆమెను ఒక రేంజ్ కు లేపుతారు. ప్రేమలు రిలీజ్ అయినప్పటి నుంచి మమితా బైజు ట్రెండింగ్ లో ఉంటుంది. ప్రేమలు చూసిన తర్వాత అమ్మడికి తెలుగులో క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే తమిళంలో విష్ణు విశాల్ తో ఒక సినిమా లాక్ చేసుకున్న మమితా తెలుగులో టైర్ 2 హీరో సినిమా కోసం సంప్రదించారని తెలుస్తుంది. అంతేకాదు తెలుగు మేకర్స్ అంతా కూడా మమితా బైజు వెంట పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement