Friday, May 10, 2024

HOLI | హోలీ పండుగ‌పై ఆ రాష్ట్రంలో ఆంక్షలు..

బెంగళూరులో నీటి కష్టాలు మరింత పెరగుతున్నాయి.. నీటి సంక్షోభంతో తాగు నీరు సరిపడినంత దొరక్క నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు వారాలుగా బెంగళూరులో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో బెంగళూరు ప్రజలకు నీటి కొరత ఇబ్బందులు తప్పడం లేదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కర్ణాటక ప్రభుత్వం హోలీ వేడుకలపై ఆంక్షలను విధించింది.

హోలీ పండగ నాడు పూల్‌ పార్టీలు, రెయిన్‌ డ్యాన్స్‌లను నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. బోర్‌వెల్‌ నీటిని కూడా హోలీ వేడుకులకు వాడుకోవద్దు అని ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement