Sunday, April 28, 2024

ఆచార్య ముహూర్తాన్నే టార్గెట్ గా పెట్టుకున్న చైతు ?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నిజానికి మే 13న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ డేట్ వాయిదా పడింది.ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా…. రిలీజ్ డేట్ ను మాత్రం ఇంకా అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. ఆచార్య రిలీజ్ నేపధ్యంలో ఆ సమయానికి పెద్ద సినిమాలు ఆ డేట్ కి ప్లాన్ చేయలేదు. ఇక ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడటంతో లవ్ స్టోరీ రిలీజ్ చేసేందుకు శేఖర్ కమ్ముల, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్ 14న రిలీజ్ కావాల్సిన లవ్ స్టోరీ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు, లుక్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే విషయమై త్వరలోనే ఓ నిర్ణయం చిత్ర యూనిట్ తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement