Tuesday, April 30, 2024

ఖుషి కథ విన్న తర్వాత లవ్ ఫీల్ తో నటించాలనే ఆసక్తి కలిగింది – విజయ దేవరకొండ

”మీతో మా సినిమా గురించి మరిన్ని విషయాలు షేర్‌ చేసుకోవాలని అనుకుంటు-న్నాము. ఇదొక అమేజింగ్‌ ఫిల్మ్‌. క్యూట్‌ లవ్‌ ఫిల్మ్‌. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్‌ అవుతారు. మన సంప్రదాయాలు, కుటు-ంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మన కథలను చూపించే అవకాశం దక్కుతోంది. ఇలాంటి -టైమ్‌ లో నేను హీరోగా ఉండటం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను.” అని హీరో విజయదేవరకొంండ అన్నారు. విజయ్‌ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా -టైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్య క్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 1న ఖుషి రిలీజ్‌ కు రెడీ అవుతోంది.

ఈ వేడుకలో విజయదేరవకొండ మాట్లాడుతూ ”పరస్పరం అర్థం చేసుకోవడం, ప్రేమను పంచడం ..ఈ రెండు క్వాలిటీ-స్‌ జీవిత భాగస్వామికి ఉండాలి. కష్ట సుఖాల్లో ఒకరికి మరొకరు సపోర్ట్‌ గా నిలవాలి. అప్పుడే బంధాలు నిలుస్తాయి. నాకు ఆ మధ్య ప్రేమ కథల మీద ఆసక్తి తగ్గిపోయింది. ఖుషి కథ విన్న తర్వాత బ్యూటిఫుల్‌ ఫీల్‌ కలిగింది. మళ్లీ ప్రేమ కథల్లో నటించాలనే ఆసక్తి కలిగింది. ఖుషి హాఫ్‌ పార్ట్‌ షూట్‌ చేసే -టైమ్‌ కు సమంతకు హెల్త్‌ బాగాలేదు. ఆమె కోసం ఆరు నెలలు కాదు సంవత్సరం అయినా వెయిట్‌ చేద్దామని అనుకున్నాం. సమంత కోలుకుంటే చాలనుకున్నాం. ఒకవేళ తను క్యూర్‌ అయ్యేందుకు పదేళ్లు పట్టినా..ఈ కథను మరోలా మార్చి ..పదేళ్ల తర్వాత సినిమా చేయాలను కున్నాం. ఈ సినిమాకు సమంత చేసిన కాంట్రిబ్యూషన్‌ మాకు తెలుసు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా..ఆమె వచ్చి సినిమా పూర్తి చేసింది.లవ్‌ అనేది అందరి లైఫ్‌ లో ఒకటే. ఆ రూ-టె-డ్‌ లవ్‌ స్టోరిని పాన్‌ ఇండియా వైజ్‌ చూపించాలని అనుకున్నాం. నాకు వెబ్‌ సిరీస్‌ లు చేసే ఉద్దేశం లేదు. నాకు పేరు ముందు బిరుదులు పెట్టు-కోవడం ఇష్టం లేదు. అందుకే ఈ సినిమాలో ద విజయ్‌ దేవరకొండ అని -టైటిల్స్‌ లో పెట్టాం.” అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మైత్రీ సీఈవో చెర్రీ, డీవోపీ జి.మురళి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌, నిర్మాత నవీన్‌ యెర్నేని, దర్శకుడు శివ నిర్వాణ తదితరులు ప్రసంగించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement