Friday, May 17, 2024

Megastar: చిరు పోరాటం!

మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకుడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ‘బింబిసార’ను అందించిన తర్వాత వశిష్ట, మెగాస్టార్‌ చిరంజీవిని దర్శకత్వం వహించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. యూవీ క్రియేషన్స్‌ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కథానాయిక.

- Advertisement -

ఇటీ-వలే కొన్ని టాకీ పార్టు, ఒక పాట, ఒక యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించి షెడ్యూల్ను ముగించారు. తాజాగా హైదరాబాద్‌లో కీలకమైన యాక్షన్‌ షెడ్యూల్ను ప్రారంభించారు.
ఫైట్‌ మాస్టర్స్‌ ద్వయం రామ్‌-లక్ష్మణ్‌ పర్యవేక్షణలో హైదరాబాద్‌లో అల్లుమినియం ఫ్యాక్టరీలో చిరంజీవి, కొంతమంది ఫైటర్స్‌పై యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తున్నారు. విక్రమ్‌, వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రమిది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement