Tuesday, October 8, 2024

TS: పెద్దపల్లిలో వంశీని భారీ మెజార్టీతో గెలిపిస్తాం… మంత్రి శ్రీధర్ బాబు

రాబోయే పార్ల‌మెంట్ ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. బుధవారం హైదరాబాద్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పార్లమెంట్ ఇంచార్జ్, రాష్ట్ర మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని, వంశీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమ‌న్నారు.

కాంగ్రెస్ శ్రేణులంతా వంశీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు విజయ రమణారావు, ప్రేమ్ సాగ‌ర్ రావు, మక్కాన్సింగ్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గడ్డం వినోద్, గడ్డం వివేక్ లతోపాటు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement