Sunday, April 28, 2024

ధోని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో LGM.. పోస్ట‌ర్ రిలీజ్

ప‌లు బిజినెస్ ల‌తో పాటు సినీ నిర్మాణ‌రంగంలోకి దిగాడు క్రికెట‌ర్ ధోని.. కాగా ధోని ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో LGM ( లెట్స్ గెట్ మ్యారీడ్) టైటిల్ తో సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ధోని విడుదల చేశాడు. తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ .. ఇవానా హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ నదియా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ ను బట్టి అర్థం అవుతోంది. విభిన్నమైన ప్రేమ కథ కమ్ పెళ్లి కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.పోస్టర్ ను విభిన్నంగా ఒక రింగ్ లో హీరో హీరోయిన్ మరియు నదియా ను బంధించి ఉన్నట్లుగా డిజైన్ చేయడం జరిగింది. పోస్టర్ చూసిన తర్వాత సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రమేష్ తమిళ్ మణి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో యోగి బాబు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ లో ఈ సినిమా ను తెగ ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement