Wednesday, May 15, 2024

Rajinikanth | ర‌జినీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్‌డేట్..

సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రజినీకాంత్.. టి.ఈ. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో ఓ మూవీ ఓకే చేసాడు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నీ తలైవా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. బాలీవుడ్ అగ్ర దర్శక, నిర్మాతైన సాజిద్ నడియావాలాతో ఓ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తొంది. రజినీకాంత్ నివాసంలో సాజిద్ మర్యాద పూర్వకంగా కలిసిన ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, తొలిసారి దక్షిణాది హీరో రజినీకాంత్‌తో సాజిద్ నడియావాలా సినిమా నిర్మిస్తున్నట్టు పేర్కొనడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈయన రజినీకాంత్‌, లోకేష్ కనగరాజ్ కాంబోకు నిర్మాతగా వ్యవహరిస్తారా.. లేదా మరో దర్శకుడితో రజినీతో సినిమా చేస్తాడా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement