Monday, April 29, 2024

బోయపాటి సూర్య మూవీపై లేటెస్ట్ అప్డేట్!!

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాని ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కించనున్నారట.

తెలుగు మరియు తమిళంలో ఒకేసారి బై లాంగువల్ సినిమాగా ప్లాన్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ కానుందనేది చూడాలి. అలాగే ఈ చిత్రాన్ని కూడా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఇక బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement